NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో 175 మైనర్ ఇరిగేషన్ చెరువులకు మరమ్మత్తులు, పునరుద్దరణ

1 min read

పునర్నిమాణం పనులపై (ఆర్ ఆర్ ఆర్) ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆమోదం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలోని 175  మైనర్  ఇరిగేషన్ చెరువులకు సంబంధించి రూ.160.25   కోట్ల తో మరమ్మత్తులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాలపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు జిల్లా స్థాయి పరిశీలన కమిటి ఆమోదించింది.  స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో  ప్రతిపాదనలపై సంబంధిత శాఖల అధికారులతో  జిల్లా కలెక్టర్  చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లాలో మొత్తం 1513  మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, వాటిలో మొదటి దశలో 175 చెరువులకు మరమ్మత్తులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాల పనులు చేపట్టేందుకు మొదటి దశలో రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిటీ తీర్మానించింది. అదేవిధంగా 100 సాగు, త్రాగునీటి చెరువుల ఫిల్లింగ్ నకు సంబంధించి ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిటీ తీర్మానించింది.      మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మత్తులు, భూగర్భ జలాల పెంపు, సాగు, త్రాగునీటి చెరువుల నింపేందుకు చర్యలు తీసుకోవాలని, పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, పనులు పూర్తి అయ్యేవరకు పనుల పురోగతిని, నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగేలా ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవ ప్రకాష్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధరావు,డ్వామా పీడీ సుబ్బారావు,భూగర్భ జల శాఖ డిడి పి.కోదండరావు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author