NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి..

1 min read

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

పారిశ్రామిక‌వేత్తల‌కు అనుకూల వాతావ‌ర‌ణం రాష్ట్రంలో క‌ల్పిస్తున్నాం

రాష్ట్రాభివృద్ధిలో అధికారులు కూడా భాగ‌మ‌వ్వాలి

ఏపీఐఐసీ కార్యాల‌యంలో నిర్వహించిన‌ జీ.యంల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్తలు ఎంతో ఆస‌క్తి చూపుతున్నార‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో అన్ని జిల్లాల జీ.యంల‌తో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ప‌రిశ్రమ‌ల శాఖ కమిష‌న‌ర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్‌తో క‌లిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న కంపెనీల‌కు సంబంధించిన అనుమ‌తుల వివ‌రాలు ఆరా తీశారు. గ‌త 5 ఎస్‌.ఐ.పి.బి స‌మావేశాల్లో ఆమోదించిన పెట్టుబ‌డులకు చెందిన ప్రాజెక్టుల‌పై చ‌ర్చించారు. ఆర్సెలార్ మిట్ట‌ల్, బిపిసిఎల్, ఎల్.జి ఎల‌క్ట్రానిక్స్, ట‌ఫే, టాటా క‌న్సల్టెన్సీతో పాటు అన్ని కంపెనీల ప్రస్తుత ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీలను వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీల గురించి జిల్లాల వారీగా, పరిశ్రమల వారీగా చర్చించారు.అనంత‌రం మంత్రి టి.జి భ‌ర‌త్ మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో త‌మ‌ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. పారిశ్రామిక‌వేత్తలు ఏ జిల్లాలో ప‌రిశ్రమ‌లు పెడుతున్నారో అక్కడి అధికారులకు పూర్తి అవ‌గాహ‌న ఉండాల‌ని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్తల‌కు ప్రభుత్వం ప్రోత్సాహం క‌ల్పిస్తోంద‌న్నారు.  ప‌రిశ్రమ‌లు పెట్టేందుకు అనుమ‌తులు ఇచ్చే విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌కూడ‌ద‌న్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంట‌నే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాల‌న్నారు. రాష్ట్రాభివృద్ధిలో అధికారులు భాగ‌మ‌వ్వాల‌ని మంత్రి చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీల‌తో పాటు ఎంఎస్ఎంఈల‌కు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంద‌న్నారు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుచేస్తున్నామ‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యండ్లూమ్ టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాట‌వుతున్నాయ‌న్నారు. దీని ద్వారా స్థానికంగా పెట్టుబ‌డులు రావ‌డంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌న్నారు. ప‌రిశ్రమ‌ల ఏర్పాటులో జిల్లా స్థాయిలో జీ.యంల పాత్ర ఎంతో ముఖ్యమ‌న్నారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా ప‌నిచేయాల‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *