NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైద‌రాబాద్‌లో ఐఏపీకాన్ 2026 ప్రారంభం

1 min read

హోస్పైస్‌, ఇల్లు, ఆసుపత్రి మధ్య నిరంతర సేవల సమన్వయానికి అంత‌ర్జాతీయ నిపుణుల పిలుపు

హైదరాబాద్‌, న్యూస్​ నేడు  : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ (ఐఏపీకాన్ 2026) 33వ వార్షిక అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ)లో ఘనంగా ప్రారంభమైంది. స్పర్శ్ హోస్పైస్‌, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఈ మూడు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాయి. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి 800 మందికిపైగా వైద్యులు, పరిశోధకులు, కేర్‌గివర్స్ హాజరవుతున్నారు. “కంటిన్యూమ్ ఆఫ్ కేర్: హాస్పిటల్, హోస్పైస్, హోమ్” అనే ప్రధాన అంశంతో సదస్సు సాగుతోంది. ప్రాణాపాయ వ్యాధులతో పోరాడుతున్న రోగులకు సమన్వయంతో, మానవీయంగా, గౌరవప్రదంగా సేవలు అందేలా వైద్య వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.  సస్టైనబిలిటీ, డిజిటల్ యాక్సెస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఐఏపీసీ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. శాస్త్రీయ సెషన్లు, షెడ్యూల్లు, సదస్సు సమాచారాన్ని ప్రతినిధులు డిజిటల్ రూపంలో పొందేలా ఈ యాప్ సాయం చేస్తుంది. కాగితం వినియోగం తగ్గించాల‌నే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ అడుగు వేశారు. ఆసుపత్రులు, హోస్పైస్ కేంద్రాలు, ఇళ్లలో ఎక్కడ ఉన్నా రోగులకు గౌరవప్రద సేవలు అందేలా జాతీయ స్థాయి నెట్‌వర్క్‌ను విస్తరించాలనే దిశగా ఐఏపీకాన్ 2026 కీలక వేదికగా నిలుస్తుందని వారు వెల్లడించారు. మీడియా అవ‌స‌రాల‌కు సంప్ర‌దించండి: పూర్ణఅధికారిక వెబ్‌సైట్: www.iapcon2026hyd.com.

About Author