ఒక నిర్ణయం… ఒక శస్త్రచికిత్స తల్లి–బిడ్డల ప్రాణాలు కాపాడింది
1 min read

విజయంవతంగా కిమ్స్ కర్నూలులో చికిత్స
కర్నూలు, న్యూస్ నేడు : సాధారణ గర్భధారణ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఊహించని విషయం బయటపడింది. లక్షణాలు ఏవీ లేకపోయినా గర్భిణి కిడ్నీలో 4 సెంటీమీటర్ల పరిమాణంలో పెద్ద రాయి ఉన్నట్టు గుర్తించారు. నొప్పి, జ్వరం, మూత్ర సంబంధిత సమస్యలు లేకపోయినా రాయి పరిమాణం పెద్దగా ఉండటంతో, భద్రతా చర్యగా గర్భధారణ నిలిపివేయాలన్న సూచనను ఇతరత్రా ఆసుపత్రిలో కుటుంబానికి ఇచ్చారు. అయితే స్పష్టమైన, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్యాభిప్రాయం కోసం కుటుంబ సభ్యులు కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలోని సీనియర్ యూరాలజిస్ట్ డా. వై. మనోజ్ కుమార్, సంప్రదించారు. సమగ్ర పరీక్షల అనంతరం, లక్షణాలు లేని కిడ్నీ రాయి ఉన్నంత మాత్రాన గర్భధారణను నిలిపివేయాల్సిన అవసరం లేదని, తల్లి–బిడ్డ ఆరోగ్య స్థితి నిలకడగా ఉన్నప్పుడు తక్షణ శస్త్రచికిత్స కూడా అవసరం లేదని ఆయన వివరించారు.వైద్య మార్గదర్శకాలకు అనుగుణంగా, గర్భధారణను కొనసాగిస్తూ క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, కీలక దశలో అనవసర వాటిని నివారించాలన్న సూచన ఇచ్చారు.“ప్రతి వైద్య నిర్ధారణకు తక్షణ చర్యే సరైనదని భావించకూడదు. కొన్నిసార్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఉత్తమ చికిత్స అవుతుంది,” అని డా. మనోజ్ కుమార్ తెలిపారు.ఈ ఘటన, సమయోచితమైన వైద్య నిర్ణయం మరియు సరిగ్గా ప్రణాళిక చేసిన శస్త్రచికిత్స ద్వారా తల్లి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, బిడ్డ భవిష్యత్తును కూడా సురక్షితంగా నిలబెట్టవచ్చని చాటిచెప్పుతోంది.

