జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలి
1 min read
కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించండి
గడువులోపు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలి
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు :జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టమోటా, ఉల్లి, మిర్చి, మిల్లెట్స్ కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను గుర్తించి పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ, ప్రాసెసింగ్ శాఖ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు.. పత్తికొండలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పై కలెక్టర్ ఆరా తీశారు..త్వరలో భూమిపూజ చేయనున్నట్లు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారి కలెక్టర్ కు వివరించారు.. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎక్స్టర్నల్,ఇంటర్నల్ రోడ్ల నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఆదేశించారు.. అదేవిధంగా నీటి సరఫరా పైపు లైన్ నిర్మాణపు పనులు 68 శాతం అయ్యాయని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నియోజక వర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తించేందుకు సంబంధిత ఆర్టీవోలు, సబ్ కలెక్టర్లతో పరిశ్రమల శాఖ ,ఏపీఐఐసీ జెడ్ ఎం సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఇందుకు సంబంధించి వారంలోపు తనకు నివేదిక పంపాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ జి ఎం ను ఆదేశించారు.ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఎల్డీఎం ను ఆదేశించారు.. తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లతో సమావేశాలు నిర్వహించి కారణాలు ఏంటి అని చర్చించాలని సూచించారు..అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద కూడా దరఖాస్తులు పెండింగ్ లేకుండా రాష్ర్ట ప్రభుత్వానికి పంపించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..MSME సర్వే త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సర్వే లో వెనుకబడిన మండలాలకు పరిశ్రమల శాఖ అధికారులు వెళ్లి, సర్వే పూర్తి చేసేలా సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయ్యేందుకు వీలుగా ప్రతిపాదనలను రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. పరిశ్రమల శాఖ జిఎం ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్, పరిశ్రమల శాఖ అసోసియేషన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రభుత్వానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.సింగిల్ డెస్క్ పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..MSME ల ఏర్పాటుపై అవగాహనా సదస్సులను నిర్వహించి, అన్ని శాఖల అధికారులను ఈ సదస్సులకు ఆహ్వానించాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ జి ఎం ను ఆదేశించారు.రూ.1.69 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదంపరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 17 క్లెయిమ్ లకు రూ.1.69 కోట్లకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ క్రింద 8 క్లెయిమ్స్ కు సంబంధించి రూ. 77,16,239/-, విద్యుత్ ఖర్చు రీయింబర్స్‌మెంట్ క్రింద 6 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.2,61,078/-, వడ్డీ రాయితీ రీయింబర్స్‌మెంట్ క్రింద 2 క్లెయిమ్స్ కు సంబంధించి రూ.2,11,846/- లు, సేల్స్ టాక్స్ రీయింబర్స్‌మెంట్ క్రింద ఒక క్లెయిమ్ కి సంబంధించి రూ.86,63,428/- లు పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కేటగిరీల వారీగా జనరల్ క్రింద 5, ఎస్సీ క్రింద 8, ఓబీసీ క్రింద 4, మొత్తంగా 17 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు.సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్చార్జి జిఎం అరుణ, ఎపిఐఐసి జోనల్ మేనేజర్, ఐలా ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి,ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామచంద్ర రావు, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
