ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పథకాలు సాధిస్తా
1 min read
ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ శిరీష
వజయవాడ న్యూస్ నేడు : ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ పోటీలలో మన దేశానికి తన ద్వార గోల్డ్ మెడల్ రావటం ఎంతో గర్వకారణంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి. శిరీష వెల్లడించారు. యోగాలో ఎంఎస్సీ , (M Phil) వరకు పూర్తి చేశాను. వివిధ కళాశాలలో విద్యాసంస్థలో పనిచేస్తూ యోగ పోటీలో పాల్గొంటున్నానని ,యోగాలో 18 సంవత్సరాల అనుభవం ఉందని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పథకాలు సాధిస్తానని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యుత్తమ సాంకేతికత మరియు భాగస్వామ్యాన్ని ప్రదర్శించి, కళాత్మక యోగాసన పెయిర్ ఈవెంట్‌లో గెలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ గెలుపుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు.న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి బంగారు పతకం తీసుకురావటం తనకు ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. శిరీష యోగ అకాడమీ స్థాపించి పేద మధ్యతరగతులకు ఉచిత యోగా శిక్షణ ఇచ్చి వారి ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తయారు చేస్తానని అన్నారు.యోగ స్పోర్ట్స్ ఆసియా అంతటా ఉన్న ప్రతిభావంతులైన యోగులను ఒకచోట చేర్చిందని, ఈ స్పోర్ట్స్ లో అసాధారణ నైపుణ్యం మరియు అంకితభావాన్ని ప్రదర్శించడం పల్లె మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. ఏపీ తరఫున భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎన్నిక ఆవడం చాలా ఆనందంగా ఉందని ,ఈ ఛాంపియన్‌షిప్‌కు నా ప్రయాణం కృషి, పట్టుదల, యోగా పట్ల మక్కువతో ముందుకు సాగిందన్నారు. మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులు బాలo సుబ్బారావు, గురువులు బి.సత్యనారాయణ రాజు, జి. సీతారామయ్య , ఎంమ్ .అంకమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, దాని ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రచారం చేయడం కొనసాగిస్తాన్నారు.