విద్యార్థి యువత ఉద్యమిస్తే ఎంతటి అవినీతి ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే
1 min read
ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అన్వేష్
పత్తికొండ , న్యూస్ నేడు : విద్యార్థి,యువజన సంఘాల నాయకులు ఉద్యమిస్తే ఎంతటి అవినీతి ప్రభుత్వాలైన కూలిపోవాల్సిందేనని అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామే నిదర్శనమని విద్యార్థి యువజన సంఘాల జిల్లా నాయకులు అన్నారు.శనివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పత్తికొండ పట్టణంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి నందు ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణ సంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అన్వేష్, ఏఐఎస్ఎఫ్ పత్తికొండ మండల కార్యదర్శి శివ మాట్లాడుతూ దేశంలో నీటి పరీక్ష పేపర్ లీక్ కావ్వడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి కారణమని కొద్ది రోజుల నుండి విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని మండిపడ్డారు,ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు వణుకు పుట్టే విధంగా విద్యాశాఖ మంత్రి రాజీనామే చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ఆ రాజకీయ పార్టీలు విద్యార్థులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనాఉందనిఅన్నారు.అంతేకాకుండా పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం ద్వారా గాయాల పాలై,ప్రాణాలర్పించిన వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి విద్యార్థి సంఘాల నాయకులుపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మోహన్,నజీర్. ఆల్తాఫ్, శ్రీహరి మా భాష అహ్మద్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


