NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసారా..స్కూటీ సీజ్

1 min read

ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..

నందికొట్కూరు న్యూస్ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నాటు సారాయి మరియు స్కూటీని సీజ్ చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్  సీఐ రామాంజనేయులు అన్నారు.జిల్లా అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో బుధవారంబ్రహ్మంగారి మఠం వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా నందికొట్కూరు వైపు నుండి షికారి కాలనీకి చెందిన షికారి హిరానీ కుమారుడు షికారి కృష్ణ తన జూపిటర్ మోటార్ సైకిల్ పై నాటు సారాయిని పెట్టుకుని తీసుకెళ్తుండగా ఎక్సైజ్ శాఖ పోలీసులను చూసి నిందితుడు వాహనాన్ని మరియు నాటు సారాయి వదిలి పారిపోయాడు.కృష్ణ సారాయి సుమారు 12 లీ. మోటార్ సైకిల్ జూపిటర్ టీవీఎస్ కంపెనీ రిజిస్టర్ స్కూటీ (ఏపి 40 ఈవై 8383) ని పోలీసులు సీజ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు భాష్యం శ్రీనివాసులు, జఫురుల్లా,హెడ్ కానిస్టేబుల్ శేఖర్,కృపావర కుమారి, కానిస్టేబుల్ శివన్న,కె సుధీర్ కుమార్,శ్వేతారాణి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

About Author