NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు సృజనాత్మకత కలిగి ఉండాలి..

1 min read

కర్నూలు,న్యూస్​  నేడు:  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆవిష్కరణ, సృజనాత్మకతతోపాటు ఆచరణాత్మకమైన సమస్య పరిష్కార విధానాలు ఎంతో ముఖ్యమైనవని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పేర్కొన్నారు. యూనివర్సిటీ సెనేట్ హాలులో ‘సస్టెయినబుల్ బయో-ఇన్నోవేషన్ ఐడియాస్’ అనే అంశంపై ఈరోజు నిర్వహించిన హ్యాకథాన్ / ఐడియాథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు రూసా 2.0లో భాగంగా ఎక్సెల్‌ ఆర్ సంస్థతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వాస్తవ సమస్యలను గుర్తించడానికి విభిన్నంగా ఆలోచించడానికి, వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేయడానికి వీలుకల్పిస్తుందన్నారు. యోగివేమన యూనివర్సిటీకి చెందిన ఆచార్య వెంకటరామిరెడ్డి, అనంతపురం జెఎన్​టీయు  (కలికిరి) ఆచార్య ఆర్. రమణారెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన ఆచార్య రామిరెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య పి. వెంకట సుందరానంద్, ఎక్సెల్ ఆర్ సంస్థ ప్రతినిథులు మహమ్మద్ అఫ్సర్ పాషా, ఎస్. మహేందర్‌తోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *