పత్తికొండను కరువు మండలంగా ప్రకటించాలి – సీపీఐ
1 min read
కరువు కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి
న్యూస్ నేడు , పత్తికొండ: పత్తికొండ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని, కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజాసాహెబ్, సీపీఐ మండల కార్యదర్శి యు. కారుమంచి, డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ చేపట్టిన పాదయాత్రలో భాగంగా దేవనబండ, నలకదొడ్డి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, కరువు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే నలకదొడ్డి చెరువుకు నీళ్లు మళ్లించాలని డిమాండ్ చేశారు .ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. కరువు కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు .50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర ఆందోళనలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షలఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని వారు వాపోయారు.అలాగే ఈ నెల 18వ తేదీన కర్నూలులో నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


