NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద  ఎంపీటీసీ–2లో స్వతంత్ర అభ్యర్థి కొలిమి సలాం ఇంటింటి ప్రచారం

1 min read

ప్రజలతో మమేకం.. స్థానిక సమస్యలపై చర్చ

సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ

సిలిండర్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద ఎంపీటీసీ–2లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన కొలిమి సలాం శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని తన డివిజన్‌లో వివిధ వీధుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకున్నారు.ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలతో చర్చించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీటీసీ–2లో పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వీధి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికల్లో తనకు సిలిండర్ గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని కొలిమి సలాం ప్రజలను కోరారు. శనివారం నిర్వహించిన ప్రచారంలో స్థానిక ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *