ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తం !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ మరింత అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తక్షణమే వెనక్కిరావాలని పిలుపునిచ్చిన భారత్.. వారు స్వదేశం చేరుకునేందుకు వీలుగా విమానాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. మరోవైపు.. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఉక్రెయిన్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి భారతీయులకు దీని నుంచి సేవలు అందిస్తామని అధికారులు చెప్పారు. కాగా, భారతీయులను రప్పించే విషయంపై పార్లమెంటరీ కమిటీ కూడా రంగంలోకి దిగింది.