NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైతన్య సంస్థలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

1 min read

మదనపల్లె అక్టోబర్ 31, న్యూస్ నేడు ప్రతినిధి : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ వర్ధంతి కార్య క్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు.చైతన్య  సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ. కవితా రాణి ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏ. కవితా రాణి మాట్లాడుతూ దేశ ఐక్యతే మహా బలమని విశ్వ సించి, సంస్థానాల విలీనంతో భారత దేశ సమగ్రతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన దృఢ సంక ల్పానికి, దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి పిల్లలకు వివరించారు.ఇందిరాగాంధీ ధైర్య సాహసాలు, దృఢ మైన నాయకత్వ లక్షణాలు, దేశాభి వృద్ధికి ఆమె చేసిన సేవలను వివరిస్తూ, మహిళలు ఆత్మ విశ్వాసంతోముందుకు సాగేందుకు ఆమె జీవితం ఒక గొప్ప స్ఫూర్తి అన్నారు.సంస్థ కోశాధికారి పి. గిరిజమ్మ మాట్లా డుతూ దేశం కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని, వారి ఆశయాలను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసు కోవాలని సూచిం చారు. ఈ కార్య క్రమంలో సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *