NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీఎస్సీ అభ్యర్థుల పోరాటానికి కాటసాని సంఘీభావం..!!!

1 min read

పాణ్యం, న్యూస్​ నేడు: పాణ్యం నియోజకవర్గం  గడివేముల టౌన్ నందు డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి  సంఘీభావం తెలిపారు.సాయంత్రం 5 గంటలకు దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాటసాని రామభూపాల్ రెడ్డి , దీక్షలో పాల్గొన్న యువజన, విద్యార్థి విభాగాల నాయకులకు,డీఎస్సీ అభ్యర్థులకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కాటసాని రామభూపాల్ రెడ్డి  స్పష్టం చేశారు.అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని, ఈనెల 10న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల నాయకులు, అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో ఉన్నవారు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author