NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

21 జూన్ 2026 న అంతర్జాతీయ యోగా దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జి. కబర్థి   ఈ రోజు అనగా 21-06-2026 న జిల్లా కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని న్యాయమూర్తులు, న్యాయ వాదులు, కోర్టు సిబ్బందిలతో ఘనంగా నిర్వహించారు.  అనునిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను అధికమించడానికి నిజజీవితంలో యోగా అవసరమని, యోగా వల్ల ప్రశాంతతోపాటు ఆరోగ్యానికి మంచిదని, యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తూ యోగా సాధన ద్వారా  ప్రతి వ్యక్తి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనేది యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయంగా యోగా దినోత్సవ  ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేసారు. న్యాయ శాఖ ఉద్యోగి యోగా మాస్టర్ ముంతాజ్  ద్వారా అనునిత్యం చేసుకొనే కొన్ని యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు రామచంద్రుడు,  శోభారాణి, లక్ష్మి రాజ్యం, వెంకట హరినాధ్, జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ,  జూనియర్ సివిల్ జడ్జి లు సంధ్య రాణి, అపర్ణ, సరోజనమ్మ, అనూష,స్రవంతి అనిల్ కుమార్, న్యాయ వాదులు, న్యాయ శాఖ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

About Author