NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: మూడు రోజుల క్రితం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ గ్రాండ్ హోటల్ సమీపానగల కర్నూలు సిటీ కేఫ్ నందు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన పాతబస్తి గరీబు నగర్ కి చెందిన నవీద్ తన మిత్రులు మెహబూబ్ బాషా, బీసన్న లతో కలిసి సదరు కర్నూలు సిటీ కేఫ్ లో మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఇద్దరు మగ వ్యక్తులు కేఫ్ లోకి అక్రమంగా ప్రవేశించి నవీద్ ని  చంపాలనే ఉద్దేశంతో  నవీద్ పై కత్తులతో దాడికి పాల్పడగా మెడ కింది భాగాన భుజానికి మధ్య తీవ్ర గాయాలు కలిగి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం తన స్నేహితులు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి,  నవీద్ స్నేహితుడు మహబూబ్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కింద కేసు నమోదు పరిచి, దర్యాప్తులో భాగంగా సిసి ఫుటేజ్ లను పరిశీలించి దాడికి పాల్పడిన వారు నవీద్ ఇంటి సమీపాన నివసిస్తున్నటువంటి గుజిరి సామాన్ల వ్యాపారం చేసే షేక్ష, అతని అన్న కొడుకు అబ్దుల్ రెహమాన్ మరియు అతని అక్క కొడుకు అయిన రెహాన్ లుగా గుర్తించడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి షేక్ష గౌరవ ఫస్ట్ అడిషనల్  జ్యూడిషల్   మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి ముందు శుక్రవారం రోజున జూవేనైల్ కోర్ట్ నందు లొంగిపోగా మిగతా ఇద్దరు ముద్దాయిలని నిన్నటి రోజున అరెస్టు చేసి దాడికి ఉపయోగించినటువంటి రెండు కత్తులను మరియు ఒక ఆటోను సీజ్ చేసి వారిద్దరిని గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టగా రిమాండ్ ఆదేశించగా, పంచాలింగాల జైలు కి తరలించడం జరిగింది.నవీద్ మరియు షేక్ష మధ్య  ఎలకూరు బంగ్లాస్ వద్ద గల ఒక 5 సెంట్ల ప్లాట్ విషయమై జరిగిన లావాదేవి లలో వచ్చిన మనస్పర్థలు ఈ హత్యాయత్నం కి దారి తీసినట్టు తెలియుచున్నది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *