రచ్చమరి అభివృద్ధి పనుల అక్రమాల పై విచారణ
1 min read
విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి
తప్పుల తడకగా సమాచార హక్కు చట్టం నివేదిక ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ కార్యదర్శి మహేష్ పై డిఎల్పీఓ నూర్జహాన్ ఆగ్రహం
విచారణ నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తాము
మంత్రాలయం , న్యూస్ నేడు : మండల పరిధిలోని రచ్చుమర్రి గ్రామానికి చెందిన జె. విజయ కుమార్ అనే వ్యక్తి గ్రామ పంచాయితీ లో నిధులు తప్పుదారి పట్టించి ఆర్థిక నేరాలకు పాల్పడినారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు విన్నవించారు. ఇందులో భాగంగా మంగళవారం డిఎల్పీఓ నూర్జహాన్ స్థానిక గ్రామ సచివాలయంలో అభివృద్ధి పనుల అక్రమాలు, పంచాయతీ కార్యదర్శి మహేష్ పై విచారణ చేపట్టారు. సమాచార హక్కు చట్టం క్రింద రచ్చుమర్రి గ్రామ పంచాయితీ యొక్క నిధుల వినియోగం సంబంధించిన వివరములను కోరడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ సమాచారము ఆలస్యముగా ఇవ్వడం జరిగిందని అయితే తప్పుడు సమాచారము ఇచ్చారని 2019వ సంవత్సరము నుండి పంచాయితీ అధికారులు తీవ్ర స్థాయిలో నిధులను తప్పుదారి పట్టించి ఆర్ధిక నేరాలకు పాల్పడియున్నారని ఆరోపించారు. జరిగిన ప్రతి పనిపై రికార్డును ప్రత్యేక అధికారి వారిని నియమించి, విచారణ జరిపించి, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ,జిల్లా పంచాయతి అధికారి,సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆ మేరకు, జిల్లా పంచాయితి అధికారి ఆదోని డివిజన్ వారికి పంపుతూ, సమగ్ర విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారని డి ఎల్ పి ఓ నూర్జాన్ తెలిపారు. పై విషయమై, రచ్చుమర్రి పంచాయితీ కార్యదర్శి మహేష్ పై మంగళవారం గ్రామ సచివాలయంలో ఫోరం ఫర్ ఆర్టీఐ కర్నూలు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ విజయ్ కుమార్ సమక్షంలో విచారణ చేపట్టారు.ఇందులో భాగంగా భాగంగా 2019 నుండి నేటి వరకు జరిగిన అభివృద్ధి పనులపై ఒక్కొక్కటే పరిశీలించగా పంచాయతీ కార్యదర్శి మహేష్ ఇచ్చిన సమాచారం పై డిఎల్పి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు పట్ల పంచాయతీ రికార్డులను సరిగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారం లో కొన్నిచోట్ల ఒకే పనిని రెండుసార్లు నమోదు చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మహేష్ ను ఎందుకు ఒకే పనిని రెండుసార్లు నమోదు చేయించవలసి వచ్చిందో వివరణ అడిగారు. కొన్ని పొరపాట్లు జరిగింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. మంత్రాలయం మండలం ఆర్డబ్ల్యుఎస్ ఏ ఈ వెంకట రమణ అభివృద్ధి పనులను ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి కొన్ని పనులకు అక్రమంగా బిల్లులు వేయించుకునట్లు ఆయన తెలిపారు. కొన్ని వీధుల్లో గ్రామ సురుతము సొంత నిధులతో పైపులైను వేయించుకుని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ అక్రమంగా బిల్లులు చేసుకున్నట్లు డిఎల్పీ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ను వివరణ కోరగా వారు యం బుక్ లో లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయని సమాచార హక్కు చట్టం నివేదిక లో తప్పుల తడకగా పంచాయతీ కార్యదర్శి ఇవ్వడం వాస్తవం సమాధానం ఇచ్చారు. చాలాచోట్ల గ్రామంలో డ్రైనేజీ మురుగు వ్యవస్థ సరిగ్గా లేదని గ్రామస్తులు డీఎల్పీ దృష్టికి తెచ్చారు. అందుకు ఆమె స్పందించి 15 రోజులకు ఒకసారి శుభ్రంగా ఉంచాలని ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ ను ఆదేశించారు. విచారణలో భాగంగా విలేకరులు ఆమెను ప్రశ్నించగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాచారం రికార్డులో ఉన్న సమాచారం కొంతమేరకు సరిగ్గా లేదని తమ దృష్టికి వచ్చిందని, పంచాయతీ కార్యదర్శి మహేష్ పై ఉన్నత అధికారులకు పూర్తి నివేదిక సమర్పిస్తానని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి పై డిఎల్పీఓ నూర్జహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పద్ధతి సరిగా మార్చుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకానొక సమయంలో టిడిపి వైసిపికు చెందినవారు డిఎల్పిఓ ఎదుటే దుర్భాషలాడుకున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి పనులపై తప్పుడు సమాచారం ఇచ్చిన మహేష్ పై ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ విచారణలో ఈ ఓ ఆర్ డి ప్రభావతి, ఫోరం ఫర్ ఆర్టీఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప ఆరోపణలు ఎదుర్కొన్న పంచాయతీ కార్యదర్శి మహేష్, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకటరాముడు, సర్పంచ్ మేకల సుజాత, నారాయణ, గ్రామస్తులు హుసేని, యాగంటి ఈరన్న, సాగునీటి సంఘం అధ్యక్షులు వెంకట్ రాముడు, బండ్రాళ్ల నరసింహులు, కురువ రఘు, బంగారయ్య, మోడల్ స్కూల్ హై స్కూల్ చైర్మన్ వెంకటేష్, చిదానంద, జనసేన ఏసేబులు పాల్గొన్నారు.