మెగా డీఎస్సీ పేరుతో జగన్ యువతకు మోసం చేశారు
1 min read
సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ గారి చిత్రపటాలకు పాలభిషేకం_
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ప్రతినిధి ఎమ్మిగనూరు పట్టణంలో వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు. సోమవారం స్థానిక కుర్ణీ కల్యాణ మండపంలో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 6 వేలు డీఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం 16 వేల డీఎస్సీ పోస్టులను విడుదల చేశామన్నారు. ఇందుకు ఎమ్మిగనూరు ప్రజల తరుపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలలోనే ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. పాస్టర్లకు ఐదు వేలు, ఆర్పిలకు 10 వేలు జీతం పెంచడం జరిగిందని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని దాన్ని సరిదిద్దుతూ సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డీఎస్సీ పోస్ట్లు అత్యధిక రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు టిడిపి నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.