NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఐ.టి.ఐ  ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళాశాలలో 29 న జాబ్ మేళా

1 min read

కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ జ్యోతి

సుమారు 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని,  825 మంది నిరుద్యోగ యువతి,యువకులకు ఉద్యోగ అవకాశాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ ఐ.టి.ఐ  ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళాశాల, వట్లూరు, ఏలూరు జిల్లా నందు 29-09- 2026 మంగళవారం  నాడు జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా నందు సుమారు 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని,  సుమారు  825 మంది నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం జరుగుతుందన్నారు.  ఈ జాబ్  మేళా కు 10వ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా. విద్యార్హతలు ఉంది 18 నుండి 35 వయస్సు గల వారు అర్హులన్నారు. ఈ అవకాశం అందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.   ఇతర వివరాలకు  8179391045, 9502798793 ను  (9988853335 – టోల్ ఫ్రీ) నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.  ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ బయడేటా మరియు  సర్టిఫికెట్స్ జీరాక్స్ లతో హాజరు కావాలని తెలియజేసారు.

About Author