పరసరాలను శుభ్రంగా ఉంచికోండి దోమల వృద్దిని అరకట్టండి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: పరసరాలను శుభ్రంగా ఉంచికోండి దోమల వృద్దిని అరకట్టండని వైద్యాధికారులు డాక్టర్ రంగారెడ్డి, డాక్టర్ రాహుల్ అన్నారు.ఈసందర్భంగా శనివారం జాతీయ అంటి డెంగీ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ రాహుల్,రాఘవేంద్ర గౌడు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్,పర్యవేక్షకులు మనోహర్ రెడ్డి ప్యాపిలి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ మూడు పద్ధతులు పాటించండి – డెంగీ ని నివారించండి
1.మీ ఇంటిల్లోని, పరిసరాల లోని నీటి తొట్టిలను పరిశీలించండి
2.నీటి తొట్టిలను శుభ్రపరచండి
3.నీటి తొట్టిలపైన మూతలు కప్పండి
ఇంటి చుట్టూ నీటి నిలువలు లేకుండా చేయండి- మీ కుటుంబాన్ని డెంగీ నుంచి కాపాడండి
పరసరాలను శుభ్రంగా ఉంచికోండి దోమల వృద్దిని అరకట్టండి. దోమతేరలు కట్టుకోండి దోమ కాటు నుంచి రక్షణ పొందండి అనే స్లొగన్స్ తో ప్రజలకు అవగాహనా కల్పించారు. డెంగీ జ్వరం ఏడిస్ దోమ పగటి పూట కుట్టడం ద్వారా వస్తుంది. ఇది మన ఇంటి లోని, పరిసరాల లో ని నీటి నిలువలలో గుడ్లు పెట్టి పెరుగుతాయి. ప్రతి శుక్రవారం డ్రై డే జరిపి నీటి తొట్టిలను శుభ్రం చేయడం వలన నీటి లోని లార్వాలు అంతము కావడం వలన దోమల పెరుగుదలను అరికట్టి వచ్చును.దోమలు కాటు వల్ల వచ్చే డెంగీ, మలేరియా, పైలరియా, చికెన్ గున్య, మెదడు వాపు, జికా వంటి వ్యాదులను నిర్ములించవచ్చును. డెంగీ లక్షణాలలో ముఖ్యం ఒక్కసారిగా వచ్చే అధిక జ్వరం,తలనొప్పి, కంటి వెనుక భాగం లో నొప్పి, కండరాల నొప్పులు, చర్మం పై గుండ్రటి ఎర్రటి మచ్చలు ఉంటే వెంటనే ఆసుపత్రి కి వెళ్ళాలి అని అవగాహనా కలిపిపించారు.ఈకార్యక్రమం లో పర్యవేక్షకులు సరోజ, ప్రసన్న, శ్రీనివాసులు, రోజా, ఆశ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


