NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిక్​ బాక్సింగ్​ విజేతలకు అభినందన

1 min read

క్రీడలతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ

  •  విద్యాసంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు: క్రీడలు మానసిక ఉల్లాసం.. శరీర ధృఢత్వంతోపాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత  కేవి సుబ్బారెడ్డి. ఆదివారం కర్నూలు నగరం డాక్టర్స్​ కాలనీలోని  త్రినాథ్​ అకాడమీలో  కిక్​ బాక్సింగ్​ లో జిల్లా స్థాయిలో రాణించిన  క్రీడాకారులకు మెడల్స్​, ప్రశంస పత్రాలు , ట్రోఫీ లు అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఆత్మరక్షణ కోసమే కాకుండా కిక్ బాక్సింగ్ ఉద్యోగ భవిష్యత్తు కోసం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర చారి, రాష్ట్ర పరిశీలక్షులు సుధీర్, శిక్షకులు హరి సుజిత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

About Author