ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయండి
1 min read
మహిళలకు సూచించిన ప్రముఖ సైకియాట్రి డా. మంజుల బాయి
కర్నూలు, న్యూస్ నేడు: మహిళలు ఉన్నత లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని ప్రముఖ సైకియాట్రి డా. డా.జ్యోతిర్మయి అన్నారు. మెదడులో వచ్చే మంచి ఆలోచనలను ఆచరణలో పెడితే.. సమాజం, దేశాభివృద్ధికి పాటు పడినట్లు అవుతుందని, అది మహిళల వల్లే సాధ్యమన్నారు. నగరంలోని ఏ క్యాంపు లోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ మైండ్ ద మైండ్… బి కేండ్ మైండ్ ’ అనే కార్యక్రమం జరిగింది. హార్ట్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి సైకియాట్రి డా.జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉన్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిగా… అక్కగా.. చెల్లిగా… అత్తగా… కోడలుగా… వ్యవహరించే మహిళలు తమ మెదడులో వచ్చే మంచి ఆలోచనలను నిబద్ధతతో అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. కుటుంబ అభ్యన్నతిలో..దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సూచించిన సైకియట్రి డా.జ్యోతిర్మయి… ఆ దిశగా మహిళలు ఉన్నత ఆలోచనలు, లక్ష్య సాధనకు కృషి చేయాలని మెడికల్ విద్యార్థినులను, మహిళలను కోరారు.


