NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లి రైతుల‌కు అండ‌గా సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు.. మంత్రి టీజీ భ‌ర‌త్

1 min read

ఉల్లి రైతులకు ఊరట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కింజార‌పు అచ్చెన్నాయుడు, టీజీ భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు: క‌ర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిసిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించి ఆదుకున్నార‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి రైతుల‌కు ఆర్థిక స‌హాయం అందించే కార్యక్రమంలో వ్యవ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడుతో క‌లిసి మంత్రి టీజీ భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉల్లి ధరల విషయంలో రైతులు నష్టపోకుండా త‌మ‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. హెక్టారుకు రూ.50 వేల చొప్పున సహాయం చేస్తున్నామ‌ని.. గ‌త ప్రభుత్వంలో రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. అప్పుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడే ఉల్లి రైతులను ఆదుకున్నార‌న్నారు. ఉల్లి ధ‌ర‌ల విష‌యంలో ఫేక్ ఆత్మహ‌త్యల డ్రామాలాడార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రెన్ని చేసినా రాష్ట్ర ప్రజ‌లు అన్నీగ‌మ‌నిస్తున్నార‌న్నారు. దేశంలో పెట్టుబ‌డుల‌కు గ‌మ్యస్థానంగా ఏపీ మారిపోయింద‌న్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు.

About Author