(కిడ్నీ స్టోన్స్) లాపరోస్కోపిక్ తో విజయవంతంగా తొలగింపు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 57 ఏళ్ల సుజాత అయినా మహిళ జూన్ 08,2025 అకస్మాత్తుగా నడుము ప్రాంతం నుండి లంబార్ ప్రాంతానికి వ్యాపించే తీవ్రమైన కడుపు నొప్పితో మేడికవర్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెను అత్యవసర వార్డుకు తరలించి వైద్య చికిత్స అందించారు.అయినా తనకి కడుపు నొప్పి తగ్గకపోడంతో డాక్టర్ అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ సంప్రదించి అయినా సూచనల మేరకు మెడికల్ మేనేజ్‌మెంట్‌లో ఉంచారు. అనంతరం ఆమెకు CT స్కాన్ తియ్యగా, ఆమెకు బారి స్థాయి కుడి వైపు పూర్తి స్టాగ్‌హార్న్ కేల్కులస్ (కిడ్నీ స్టోన్ ) 5.1 సెంటీమీటర్, అప్పర్ పోల్ కేల్కులస్ 1.6 సెంటీమీటర్ గా గుర్తించబడింది.వెంటనే వారి బంధువులకు కౌన్సిలింగ్ మరియు అటెండర్ల అనుమతి తీసుకున్న తర్వాత, రోగికి సిస్టోస్కోపీ, కుడి యూరెటరోస్కోపీ మరియు కుడి DJ స్టెంటింగ్ SGA కింద చేశారు. ఆపరేషన్ సమయంలో 5.1 సెంటీమీటర్ స్టాగ్‌హార్న్ కేల్కులస్, 1.6 సెంటీమీటర్ అప్పర్ పోల్ కేల్కులస్, స్వల్ప ఇన్ఫెక్టెడ్ హైడ్రోనెఫ్రోసిస్ కనుగొనబడ్డాయి. రోగికి 3 వారాల తర్వాత స్టేజ్‌డ్ కుడి RIRS చేయమని సూచించి, స్థిర స్థితిలో జూన్ 12,2025 డిశ్చార్జ్ చేశారు.
స్టేజ్ 1 శస్త్రచికిత్స: జులై 12 ,2025
మూడు వారాల తర్వాత రోగి మళ్లీ చేరి స్టేజ్ 1 కుడి RIRS, FANS (Flexible Aspiration of Nephrolithiasis System), పాత DJ స్టెంట్ తొలగింపు మరియు రీడో DJ స్టెంటింగ్ GA కింద చేయించుకుంది. ఆపరేషన్ సమయంలో అన్ని కేలిసెస్‌ను ఆక్రమించిన పెద్ద స్టాగ్‌హార్న్ కేల్కులస్ మరియు బాగా డైలేట్ అయిన యూరేటర్ కనబడింది. రోగి బాగా కోలుకొని డిశ్చార్జ్ అయింది. ఆమెకు 4 వారాల తర్వాత స్టేజ్ 2 RIRS చేయమని సలహా ఇచ్చారు, ఆమెను july 16,2025 డిశ్చార్జ్ చేసారు.
స్టేజ్ 2 శస్త్రచికిత్స: ఆగష్టు 16 ,2025
నాలుగు వారాల తర్వాత రోగి స్టేజ్ 2 కుడి RIRS + FANS + పాత DJ స్టెంట్ తొలగింపు + రీడో DJ స్టెంటింగ్ GA కింద చేయించుకుంది. ఆపరేషన్ సమయంలో:
కుడి యూరేటర్‌లో 8 మి.మీ రాయి
డైలేట్ అయిన అప్పర్ కేలిక్స్‌లో 20 మి.మీ రాయి
మధ్య మరియు దిగువ కేలిసెస్‌లో రాయి ముక్కలు కనుగొనబడ్డాయి.
రోగి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జ్ అయి, 1 నెల తర్వాత ఫాలోఅప్‌కు రావాలని సూచించి ఆగష్టు 20,2025 డిశ్చార్జ్ చేసారు.
చివరి ఫాలో-అప్: september 8,2025
ఒక నెల తర్వాత రోగి మళ్లీ వచ్చి కుడి DJ స్టెంట్ తొలగింపు చేయించుకుంది. ఈ సమయంలో రోగి లక్షణాలు లేకుండా, స్థిర స్థితిలో ఉంది. కేల్కులస్ పూర్తిగా తొలగించబడినట్లు ధృవీకరించారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు క్లస్టర్ హెడ్ డాక్టర్ వై. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసు చూపిన దాని ప్రకారం, పెద్ద స్టాగ్‌హార్న్ కేల్కులస్‌ను (కిడ్నీ స్టోన్ ) స్టేజ్‌ల వారీగా లాపరోస్కోపిక్ మేనేజ్‌మెంట్ ద్వారా సురక్షితంగా, సమర్థవంతంగా తొలగించవచ్చు. సరైన శస్త్రచికిత్స ప్రణాళిక, రోగి కౌన్సిలింగ్ మరియు క్రమమైన ఫాలో-అప్స్ ద్వారా పూర్తి రాయి తొలగింపుతో పాటు రోగి భద్రత, ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. మావద్ద అనుభవజ్ఞులైన వైద్యులచే మెడికవర్ హాస్పిటల్స్ 24/7 చిన్న అందుబాటులో ఉంది చికిత్స అందిస్తూ, సరైన సమయంలో సరైన వైద్యం, అత్యాధునిక సదుపాయాలతో మన మెడికవర్ హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తున్నాము.


