అవినీతి ఎంఈఓ ఆంజనేయులు ను తక్షణమే సస్పెండ్ చేయాలి
1 min read

ఎంఈఓ ను సస్పెండ్ చేయాలంటూ ఎంఈఓ కు లంచాలు ఇవ్వడం కోసం భిక్షాటన చేసిన ఎమ్మిగనూరు విద్యార్థి సంఘ నాయకులు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాల ముందు బయటా ఇంచి వినూత్నమైన నిరసనలు తెలుపుతూ ఉన్న మండల విద్యాధికారి ఎంఈఓ ఆంజనేయులు వారికి ఏమాత్రం సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం జరుగుతుంది కావున ఈరోజు ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర నుండి వైయస్సార్ సర్కిల్ వరకు బిక్షటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు శేఖర్ ఆఫ్రిది కృష్ణ కాజా సురేష్ ఉదయ్ రఘునాథ్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండల విద్యాధికారి పని తీరు అవినీతి మయంగా మారిందని ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల కైతే ఆయన ఒక వెన్నెముకలాగా ప్రైవేట్ పాఠశాలల బాగోగుల కోసమే ప్రభుత్వం నియమించిన విధంగా వారు వ్యవహరించడం జరుగుతుందని అదేవిధంగా ఏ పని జరగాలన్న లంచాలు లేనిదే ఎమ్మార్సీ నుండి బయటికి కూడా కాలు పెట్టినటువంటి పరిస్థితి అని అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలకు తాను అండగా ఉంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుంటూ విద్యావ్యవస్థని బ్రష్టు పట్టించడం తగదని ఎవరు ఏమన్నా పర్వాలేదు నాకు డబ్బు కావాలి అనేటటువంటి ధీమాతో డబ్బే పరమావధిగా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అందుకుగాను కనీసం విద్యార్థి సంఘాల అయినా లంచం ఇస్తే అయినా ప్రైవేటు పాఠశాల వైపు కన్నెత్తి చూస్తాడేమో అని ఈరోజు పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ నందు విద్యార్థి సంఘం నాయకులు భిక్షాటన చేసి ఆ డబ్బులు ఆంజనేయులు కి అందిస్తామని ఆ లంచం తీసుకుని అయినా ప్రైవేట్ పాఠశాలలు విసిట్ చేయాలని అదేవిధంగా ప్రైవేటు పాఠశాల విషయాల్లో ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి పర్మిషన్లు ఫైర్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ అర్హత లేనటువంటి టీచర్స్ తో బోధించడం ఇరుకు గదుల్లో మరియు రేకుల షెడ్లలో విద్యార్థులను కూర్చోబెట్టడం విద్యార్థులకు తగినటువంటి బాత్రూంలు లేకపోవడం విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట స్థలాలు మరియు బస్సుల వ్యాన్లల్లో విద్యార్థులను పశువుల తరలించడం లాంటివి జరుగుతూ ఉన్న మండల విద్యాధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం జరుగుతుంది ఇలాంటి విద్యాధికారి ఏ మండలానికి ఉండకూడదు అని వారు అన్నారు విద్యార్థి సంఘాలుగా మేము పలుమార్లు ప్రైవేట్ పాఠశాలలపై కంప్లైంట్ ఎం ఈ ఓ కి చేసిన ఈయన తీరు ప్రైవేట్ పాఠశాలల కె వత్తాసు పలికే విధంగానే ఉందని వారు అన్నారు ఇకనైనా పై విద్యాధికారులు దృష్టి ఉంచి ఎంఈఓ ఆంజనేయులు సస్పెండ్ చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

