PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డోన్ టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎమ్మెల్యేల జాబితా ను ప్రకటించారు.  డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ను ప్రకటించారు. ఈసందర్భంగా ప్యాపిలి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో  మాజీ ఎం పి పి  తొప్పేలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో తేదేపా నాయకులు,కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ  సంబరాలు  చేసుకుంటు  కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి  నినాదాలు చేస్తు సంబరాలు చేసుకోని అనంతం పట్టణంలోని పెద్దమ్మ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో తేదేపా నాయకులు కార్యకర్తలు ఒకటై సమిష్టిగా పనిచేసి వైసిపి అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై డోన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలిపించుకుని, డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు  తోప్పల వెంకట్, క్రిష్ణ మోహన్, గోల్ల రామ్మోహన్ యాదవ్,మదు,వెంగళంపల్లె అరుణ్ కుమార్ గౌడ్, రామకృష్ణ, టైలర్ రామేష్, గోపాల్, బ్యాంకు శ్రీను, ఓబులేసు, బాలు, బాలకృష్ణ, సుధాకర్, గోపాల్ టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author