నిడుగుంట అరుణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి!
1 min read
గంజాయి స్మగ్లింగ్ నిర్వహిస్తున్న నిడుగుంట అరుణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి!
న్యాయవాది పేకేటి రాజారామ్
విజయవాడ , న్యూస్ నేడు : అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నిడుగుంట అరుణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనిప్రముఖ హైకోర్టు న్యాయవాది పేకేటి రాజారామ్ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మద్దతు దారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో రక్త చరిత్ర, నేరచరిత్ర కలిగిన గంజాయి స్మగ్లర్ భార్య నిడుగుంట అరుణ అని ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, బడుగు పాడు గ్రామం లోని సాయి ఎంక్లేవ్ అపార్ట్మెంట్ కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అరుణ తన అనుచరులు ఐ మునీంద్ర, రేఖ, నిడుగుంట నరసింహులు, అరుణ అమ్మ, సత్యవేటి శివకోటయ్య, సత్యవేటి మునిస్వామి, చింతపురెడ్డి చంద్ర, చౌటూరు వెంకటరమణయ్య తదితరులతో కలిసి లేగుంటపాడు, ఇనుమడుగు, చేర్లపాలెం ఇతర కాలనీలతో పాటు బొడిగుడ తోట ప్రాంతాలలో విచ్చలవిడిగా చట్ట విరుద్ధంగా రౌడీ షీటర్ల గుండాల అండదండలతో గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అరుణతో పాటు ఆమె అనుచరులపై జిల్లా ఎస్పీ దొర కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. నిడుగుంట అరుణ చేస్తున్న గంజాయి స్మగ్లింగ్ వ్యాపారానికి కేంద్ర బిందువైన సాయి ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ లోకి ప్రతిరోజు రాత్రింబగళ్లు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తు తెలియని వ్యక్తులు రౌడీలు, గుండాలు వచ్చిపోతూ ఉంటారని వీరుని పెంచి పోషిస్తూ వారి చేత దొమ్మీలు, దొంగతనాల, దారి దోపిడీలు, హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతుందని ఈమెపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుచరులతో పోలీసు మారువేషాలు వేయించి దొమ్మీలు చేయిస్తుందన్నారు. ఈమెను చట్ట పరంగా జైల్లో ఉంచి ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.