వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన శాసనసభ్యులు
1 min read
బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రం ఏర్పాటు, మూడు పూటలా భోజన వసతి కల్పన
సాయంత్రానికల్లా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ
పాడి రైతులకు పశుగ్రాసం, దాణా పంపిణీకి చర్యలు శాశ్వత డ్రైనేజీ వ్యవస్థకు నివేదికలు సిద్ధం
శాసనసభ్యులు చింతమనేని
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు ఇటీవల సంభవించిన తీవ్ర తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల పెదపాడు మండలం గోగుంట గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు, ఎస్సీ, బీసీ కాలనీలు మరియు పరిసర ప్రాంతాల పంట పొలాలు తీవ్రంగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో సాధారణ ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధికారుల బృందంతో కలిసి గోగుంటలో విస్తృతంగా పర్యటించారు. వర్షపు నీటిలో మునిగిపోయిన నివాస ప్రాంతాలను, పంట చేలను పరిశీలించి స్థానిక ప్రజలను పరామర్శించి వారికి కొండంత ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా సహాయక చర్యలపై రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, ట్రైనీ కలెక్టర్ తో సమీక్షించిన అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.తక్షణ పునరావాసం మరియు భోజన వసతివరద నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్న బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని (రిలీఫ్ క్యాంప్) ఏర్పాటు చేశామని తెలిపారు. ముంపు బాధితులు సురక్షితంగా ఇళ్లకు చేరేంతవరకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి భోజనం ప్రభుత్వ ఖర్చులతోనే సమకూరుస్తున్నట్లు స్పష్టం చేశారు. నిత్యావసరాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా వరద ప్రభావిత కుటుంబాలకు అవసరమైన ఉచిత బియ్యం మరియు నిత్యావసర సరుకుల కిట్లను ఈరోజు సాయంత్రానికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీల పూడికతీత మరియు శాశ్వత పరిష్కారం
గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చేపల చెరువుల ప్రభావం వల్ల వరద నీరు నిలిచిపోయిందని గుర్తించామన్నారు. వెంటనే డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టి నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత డ్రైనేజీ పనులకు ప్రణాళికలు రచిస్తామని తెలిపారు.
రైతులు,పాడి పెంపకందారులకు భరోసా
పంట పొలాలు,గడ్డివాములు నీట మునిగి మూగజీవాలకు ఆహార కొరత రాకుండా పాడి రైతుల కోసం ఉచితంగా పశుగ్రాసం (గడ్డి), పశువుల దాణా సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు.క్షేత్రస్థాయిలో పర్యటించిన ట్రైనీ కలెక్టర్ తో పాటు తహశీల్దార్, ఎంపీడీవో మరియు అధికారులతో మాట్లాడి నియోజకవర్గంలో ఎక్కడా ప్రజలకు కష్టం రాకుండా పక్కాగా సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే చింతమనేని సూచించారు.ఈ పర్యటనలో ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రామ్ ప్రసాద్, మండల తహసీల్దార్ కృష్ణ జ్యోతి, మండల పార్టీ అధ్యక్షులు మరడని.రవి, పలువురు కూటమి నాయకులు కుటుంబ శాస్త్రి సహా పలువురు కూటమి నాయకులు,రెవెన్యూ సహా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



