NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‎ప్రజలు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి

1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు,అధికారులకు ఎంపీ సూచనలు

మరికొన్ని గంటల వరకు వరకూ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు

విద్యుత్ స్తంభాలు,చెట్లు విరిగిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అవసరమైతే కంట్రోల్ రూమ్ లను సంప్రదించలని సూచించన

‎ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు శుక్రవారం రోజు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఎల్ నినో ప్రభావంతో గత మూడు నాలుగు నెలలుగా భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుత వర్షాలు రైతులకు పంటలకు ఎంతో ఉపయోగకరమైనవి అయినప్పటికీ, భారీ  వర్షాలు వరదలతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలియజేశారు. ఏలూరు పట్టణంలోనూ, జంగారెడ్డిగూడెంలోను రెండు కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారని, ప్రజలు అత్యవసర ఆపద సమయంలో ఆ కంట్రోల్ రూమ్ లకు సమాచారం ఇస్తే అధికార యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున  అత్యవసరమైతే తప్ప ప్రజలు రెండు రోజులు ఇంటి నుంచి బయటికి రావద్దని కోరారు. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గ పరిధిలో వివిధ కాలువలు, ప్రాజెక్టులలో నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట్ల అధికారులు సహాయ చర్యల్లో పాల్గొనాలని ఎంపీ కోరారు. ఆపదలో అవసరమైతే తన కార్యాలయాన్ని (ఎంపీ కార్యాలయ ఫోన్ నెంబర్లు.. 9515225125, 9885519299) కూడా సంప్రదించవచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

About Author