NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సియం చంద్రబాబు మదనపల్లె పర్యటన కు హెలిపాడ్, సభాస్థలి ని పరిశీలన

1 min read

జిల్లా అధికారులు తో పాటు ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన

మదనపల్లె ,   న్యూస్ నేడు ప్రతినిధి  : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి అక్టోబర్ రెండవ తేదీన మదనపల్లె లో పర్యటించునున్ననేపథ్యంలో శనివారం జిల్లాస్థాయి అధికారులు ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. అత్యంత  ప్రతిష్టాత్మకమైన హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన కార్య క్రమంలో పాల్గొన డానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించే ప్రోటోకాల్ అధ్యక్షులు పెందుర్తి వెంకటేష్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లతో కలిసి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష  హెలిప్యాడ్,  సభ ప్రాంగణానికి అనువైన ప్రాంతాల ను పరిశీలించారు. జిల్లా అధికారులతో చర్చించి, హెలిఫాడ్లు, దానికి సమీపంలో ప్రైవేటు స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లను  ప్రారంభించడానికి పరిశీలించడం జరిగింది. 50వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను త్వరగా ప్రారంభించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ,  మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,  జిల్లా అధికారులతో పాటు ఏపీ ట్రాన్స్కో, హార్టికల్చర్, పోలీస్, రెవెన్యూ అధికారు లు పాల్గొన్నారు.

About Author