PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం

1 min read

అధికారులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : 2024 నూతన సంవత్సరంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పిలుపునిచ్చారు.ఆంగ్ల నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని…. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.జి. సృజన, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది జిల్లా కలెక్టర్ డా.జి.సృజనని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు, పండ్లను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల కనుగుణంగా నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి, ప్రజలు మెచ్చే రీతిలో సమిష్టిగా నూతనోత్తేజంతో పనిచేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ని కలిసి రెవిన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

About Author