NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

117s జిల్లా గవర్నర్ గా అలై అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  భారతదేశంలో స్థాపించబడి ఢిల్లీ కార్యాలయంగా ప్రపంచవ్యాప్తంగా వంద జిల్లాలతో 50 వేలకు పైగా సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గా అల్లీ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారికత,అనాధల, వృద్ధుల సేవా కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక సమస్యలపై అంతర్జాతీయ స్థాయి అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరచడం, న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహించడము తదితర  సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కర్నూలు నంద్యాల జిల్లాలలో అ లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూలు, అలయన్స్ క్లబ్ ఆఫ్ టీచర్స్,అలయన్స్ క్లబ్ ఆఫ్  గ్రేటర్ కర్నూలు, అలయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ హయ్యర్ ఎడ్యుకేషన్,అలయన్స్ క్లబ్ ఆఫ్ పీపుల్ సర్వీస్ అండ్ లీడర్షిప్ వాలంటీర్స్, అలయన్స్ క్లబ్ అఫ్ కర్నూలు క్లబ్ ల ద్వారా సేవా కార్యక్రమాలను చేపట్టమన్నామన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఆసక్తి ఉన్న వారు 9396861308 నెంబర్ ద్వారా సంప్రదించి సభ్యత్వ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయి సైన్స్ పోటీలు, అంతర్జాతీయ స్థాయి గ్రీన్ పోస్టర్ కాంటెస్ట్,  అంతర్జాతీయ స్థాయి పీస్ పోస్టర్ కాంటెస్ట్ లు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *