కె.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో “సైకాలజిస్ట్ అప్రిసియేషన్ డే
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: (అడ్వాన్స్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కర్నూల్ కమిటీ ప్రెసిడెంట్ సైకాలజిస్ట్ శ్రీమతి సి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఈరోజు కె.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల యందు “సైకాలజిస్ట్ అప్రిసియేషన్ డే “ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కె.వి.ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జీ.వీ. రంగారెడ్డి అధ్యక్షత వహించారు.సైకాలజీ డిపార్ట్మెంట్ ఇంచార్జి విజయలక్ష్మి, సైకాలజీ అధ్యాపకులు స్రవంతి, IQAC ఆరతి చక్ర,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమం లో పాల్గొన్నారు. డా. వరలక్ష్మి APAI state president Keynotes speaker గా వ్యవహరించారు.కర్నూలు నగరంలో సైకాలజిస్ట్ గా సేవలు అందిస్తున్న సీనియర్ సైకాలజిస్ట్ సలీం భాషా , యువ సైకాలజిస్ట్ మనోహర్ ,కర్నూలు మెడికల్ కాలేజీ నందు డి అడిక్షన్ విభాగం నందు సేవలందిస్తున్న.డాక్టర్ దుర్గా అంజలి, సైకియాట్రిస్ట్ కి సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో APAI కర్నూల్ జిల్లా విభాగం సభ్యులు పాల్గొన్నారు. వక్తలు విద్యార్థులకు అసలు అడిక్షన్ అంటే ఏమిటి? ఏ విధంగా జరుగుతుంది,దాన్నుంచి ఎలా బయటకు పడాలో ఉదాహరణ పూర్వకంగా వివరించారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారు ఏ విధంగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు వివరించారు.


