NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్  జోన్స్ 2025 -26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సీనియర్  లయన్స్ క్లబ్  మెంబర్  మాజీ లయన్స్ అడిషనల్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ  అధ్యక్షతన నేడు కే.ఎన్.ఆర్ పాఠశాలలో ఘనంగా  నిర్వహించారు. అధ్యక్షులుగా లయన్ కె. గోపీనాథ్ , ప్రధాన కార్యదర్శిగా  లయన్ కే .మహేంద్ర కోశాధికారిగా   లయన్ తెలుగు అనూష ఉప కోశాధికారిగా  లయన్ రామకృష్ణ  ,ఎల్. సి. ఐ. ఎఫ్  కోఆర్డినేటర్ గా లయన్ పేర పోగు  పవన్ కుమార్, ఉపాధ్యక్షులుగా లయన్ తెలుగు అశోక్ కుమార్ ,బి. వి ఎల్ నరసింహారావు,లయన్  డాక్టర్ రమేష్,లయన్  మురారి శంకరప్ప,లయన్  కే.డీ.జే బాబు మరియు గౌరవ అధ్యక్షులుగా  లయన్ మంజుల రాణి ,లయన్ నాగ స్వామి నాయక్ , సర్వీస్ ఆక్టివిటీస్ కమిటీ చైర్మన్గా దామోదర్ రావు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా లయన్  తిరుపతి సాయి ,క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ గా లయన్ రాయపాటి నాగలక్ష్మి   ఉప కార్యదర్శులుగా లయన్ మంజునాథ్,  లయన్ అక్బర్  లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్ష , కార్యవర్గ  సభ్యులను లయన్స్  క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

About Author