దక్షిణ భారతదేశంలో తొలి లివింగ్ విల్ క్లినిక్ ను ప్రారంభించిన స్పర్శ్ హాస్పిస్
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు : వరల్డ్ హాస్పిస్ అండ్ ప్యాలియేటివ్ కేర్ డే సందర్భంగా హైదరాబాద్‌లో స్పర్శ్ హాస్పిస్ తమ విప్లవాత్మకమైన “లివింగ్ విల్ క్లినిక్”ను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో మొదటి అడ్వాన్స్ కేర్ ప్లానింగ్‌కు అంకితమైన కేంద్రం కావడం విశేషం. ఈ క్లినిక్ ఉద్దేశ్యం జీవితాంతం వైద్యం ఎలా కొనసాగాలన్న అంశంపై రోగులు తమ అభిప్రాయాలను చట్టపరంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం. ఇది ఈ ఏడాది హాస్పిస్ డే థీమ్ అయిన “ప్రతి ఒక్కరికీ చివరి దశలో కూడా సానుభూతి, సౌకర్యం, గౌరవం కలిగిన వైద్య సేవలు అందాలన్న హామీని నిజం చేయడం”కి అనుగుణంగా ఉంది.స్పర్శ్ హాస్పిస్ లివింగ్ విల్ క్లినిక్‌లో రోగులకు కన్సల్టేషన్లు, చట్టపరమైన మార్గదర్శకాలు, కౌన్సెలింగ్ సేవలు అందించబడతాయి. ప్యాలియేటివ్ కేర్ వైద్యులు, సైకాలజిస్టులు, అడ్వాన్స్ కేర్ ప్లానింగ్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ సేవలను అందిస్తారు.
స్పర్శ్ హాస్పిస్ గురించి:
స్పర్శ్ హాస్పిస్ అనేది లాభాపేక్ష లేని “జీవితాంతం గౌరవంగా, నొప్పిలేకుండా, సాంత్వనగా ఉండేందుకు చేసే సేవ సంస్థ. ఇది హైదరాబాద్‌లోని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సానుభూతి, సౌకర్యం, గౌరవం కలిగిన సేవలు అందిస్తోంది. రోగులకు చికిత్స, కౌన్సెలింగ్, కుటుంబ సభ్యులకు మద్దతు, సమాజంలో అవగాహన పెంపు వంటి అంశాల్లో సంస్థ అనేక సేవలు అందిస్తోంది. ఆరోగ్య భాగస్వాములు మరియు ప్రభుత్వ సంస్థలతో కలిసి గౌరవప్రదమైన, అందరికీ చేరువైన ప్యాలియేటివ్ కేర్‌ను అందించడమే దీని ధ్యేయం.

