NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రికి సిలిండర్లు అందజేత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్. ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్. శంకర్ శర్మ నాలుగు ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ ను విరాళంగా ఇచ్చారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్  శర్మ మాట్లాడుతూ  తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తనవంతు సహయం చేస్తానన్నారు. కర్నూలులో  అత్యాదునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలు అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్  డాక్టర్. ప్రకాష్ విజ్ఞప్తి మేరకు  ఆక్సిజన్ సిలిండర్లు అందజేశానని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్సి స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్నారని వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహయం చేస్తానని డాక్టర్. శంకర్ శర్మ ప్రకటించారు. క్యాన్సర్ వ్యాది పై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు. క్యాన్సర్ ను మొదటి, రెండో దశలో గుర్తిస్తే వందశాతం నయం అవుతుందన్నారు. మంచి ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా చేస్తుందన్నారు. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని ఊబకాయం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని డాక్టర్. శంకర్ శర్మ వివరించారు. స్టేట్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్. శంకర్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని డాక్టర్. కుమారస్వామి రెడ్డి తెలిపారు.క్యాన్సర్ ఆసుపత్రి  డైరెక్టర్ డాక్టర్. ప్రకాష్ మాట్లాడుతూ అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు డాక్టర్. శంకర్ శర్మ ఇవ్వడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్. కేజీ. గోవిందా రెడ్డి,డాక్టర్. కుమారస్వామి రెడ్డి, డాక్టర్. ప్రకాష్, పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author