NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలి

1 min read

రుణాలు చెల్లించని లబ్ధిదారుల వాహనాలు జప్తు చేస్తాం

ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్వచ్చత ఉద్యమి యోజనలో భాగముగా NSKFDC పధకపు నిధులతో స్వచ్చంద్రా కార్పోరేషన్ మరియు యస్.సి కార్పోరేషన్ సమన్వయముతో మురుగు శుద్ది వాహనములను (Desludging Vehicle) 5 గురు గ్రూపు సభ్యులకు ఒక వాహనమును చొప్పున మునిసిపల్ కార్పోరేషన్, ఏలూరునకు 4 మురుగు శుద్ది వాహనములు (Desludging Vehicle) మంజూరు చేసి 2024వ సం.లో పంపిణీ చేయుట జరిగినదని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ముక్కంటి చెప్పారు.  కాని, 4గురు మురుగు శుద్ది వాహనముల (Desludging Vehicle) లబ్దిదారులు యస్.సి కార్పోరేషన్ కార్యాలయమునకు చెల్లించవలసిన నెలవారి వాయిదాలు సక్రమముగా చెల్లించకపోవుట, వాయిదాలు చెల్లించు విషయములో ఈ కార్యాలయము సిబ్బంది చరవాణి ద్వారా పలుమార్లు తెలియజేసినప్పటికి, నోటీసులు జారీ చేసినను బహు అలసత్వము ప్రదర్శించినందున, Go.Rt.No.217, సోషల్ వెల్ఫేర్ (SCP) డిపార్ట్మెంట్, తేది.12-08-2025 నిబంధనల మేరకు  మేనేజింగ్ డైరెక్టరు, జూమ్ కాన్ఫరెన్స్ ఆదేశముల ననుసరించి పై తెలిపిన మురుగు శుద్ది వాహనములను కార్యనిర్వాహక సంచాలకులు వారి సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది సహాయముతో శుక్రవారం ఉదయం స్వాధీనము చేసుకోనడమైనదన్నారు.48 గం.లోగా యస్.సి కార్పోరేషన్, ఏలూరునకు బకాయి పడిన సొమ్ము చెల్లించినచో సదరు వాహనములను తిరిగి లబ్దిదారులకు అప్పగించబడును. బకాయి పడిన సొమ్ము చెల్లించుటలో విఫలమైతే సదరు వాహనములను Go.Rt.No.217, సోషల్ వెల్ఫేర్ (SCP) డిపార్ట్మెంట్, తేది.12-08-2025 నియమ నిబంధనల ననుసరించి ఆసక్తి కలిగిన అభ్యర్ధులకు జాయింట్ కలెక్టరు, ఏలూరు వారి అనుమతితో ఇతరులకు కేటాయించబడునన్నారు.    అదేవిధముగా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మరియు నూజివీడు మునిసిపాలిటీల పరిధిలో ఒక్కొక్క వాహనమును కేటాయించడమైనది. సదరు లబ్దిదారులు కూడా సక్రమముగా నెలవారి వాయిదాలు యస్.సి కార్పోరేషన్, ఏలూరునకు చెల్లించనిచో వారి  వాహనములను స్వాధీనము చేసుకొనుటకు అవకాశము కలదన్నారు.

About Author