నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న 36 పాఠశాలల బస్సులపై కేసులు నమోదు
1 min read

ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం
రవాణా శాఖ,పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 36 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేశామని ఏలూరు జిల్లా ఉపరవణ కమిషనర్ షేక్ కరీం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు నగరంలోనే కాకుండా నూజివీడు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో పాఠశాల బస్సుల పై శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా సంయుక్తంగా పాల్గొన్నారు ఏలూరు నగరంలోని ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా నగరంలో పాఠశాల బస్సులపై స్పెషల్ డ్రైవర్ నిర్వహించారు. అందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 36 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు ఈ కేసుల ద్వారా ఐదు లక్షల 14,400 రూపాయలను బస్సులకు అపరాధ రుసుము విధించారు.

