NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రబీ పంటకు సాగుకు నీరు లేదు…

1 min read

అధికారికంగా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

” ప్రస్తుతం ఉన్న పంటలకు జనవరి 10 వరకు నీరు

హొళగుంద న్యూస్ నేడు : తుంగభద్ర జలాశయం నుండి విడుదలవుతున్న అన్ని కాలువలకు సంబంధించి రఖి పంటలకు సాగుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని తుంగభద్ర బోర్డు అధికారులతో సమావేశమైన కర్ణాటక ప్రభుత్వం తరపున కర్ణాటక భారీ నీటిపారుదుల శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పట్టణం నందు రుంగభద్ర జలాశయానికి సంబం ధించిన నీటి విడుదల అంశంపై శుక్రవారం కర్ణాటక అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో తుంగభద్ర 125 వసాగునీటి సలహాకమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు డీకే శివకుమార్, శివ రాజ్ కుమార్ తంగడి, మాజీమంత్రి బళ్ళారి రూరల్ శాసనసభ్యులు నాగేంద్ర పార్లమెంట్ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, ప్రాంతీయ కమిషనర్లు, కలెక్టర్లు పరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా చర్చించి రెండవ పంటకు నీటి విడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పారు. 70 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన తుంగభద్రా జలాశయం క్రస్ట్ గేట్లు ఆధ్వాన్న స్థితిలో ఉన్నందున నూతన గేట్లు అమర్చుటకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని కర్ణాటక ప్రభుత్వం, బోర్డు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిం దన్నారు. రైతులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం బరళయం నందు 75 టీఎంసీల నీరు ఉన్నాయని, 1624.84 అడుగులలో నీటి నిల్వ ఉండడంతో 1612.00 అడుగులకు నీరు చేరిన వెంటనే నూతన గేట్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియ జేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న నీటిని వృధా చేయకుండా ప్రస్తుతం వేసుకున్న పంటల కు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు ఐలాశయం నుండి విడుదలవుతున్న అన్ని కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి ఇబ్బంది తలెత్తకుండా జలాశయం నందు నీటిని నిలువ ఉంచుకుని త్రాగునీటి అవసరాలకు కూడా నీటినిమాట్లాడుతున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డితే శివకుమార్విడుదల చేసేందుకు సమావేశం నందు నిర్ణయించడం జరిగిందన్నారు. తుంగభద్ర జలాశయానికి సంబంధించి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల రైతులు సహకరించి తుంగభద్ర జలాశయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని తెలియజేశారు. తుంగభద్ర బోర్డు అధికారులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author