వినాయకుడికి విశిష్ట పూజలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని గుత్తి రోడ్డులోని శ్రీ సూర్య దేవాలయంలో ఆదివారం సంకష్ట హర చతుర్థి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రదోష కాలమున సంకష్టహర చతుర్థి వ్రతము విశేషంగా జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

