రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో.. కర్నూలు ప్రతిభ…
1 min read

అభినందించిన ఏపీఆర్ఎస్ఏ కర్నూలు అధ్యక్షుడు నాగరాజు
కర్నూలు, న్యూస్ నేడు: అనంతపురంలో జరిగిన 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించడం అభినందనీయమని ఏపీఆర్ఎస్ఏ కర్నూలు అధ్యక్షుడు నాగరాజు ప్రశంసించారు. జిల్లా రెవెన్యూ మహిళా ఉద్యోగులు ఏడు ఈవెంట్లలో గెలుపొందారని తెలిపారు. రెవెన్యూ క్రీడల్లో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనుటకు అవకాశం కల్పించినoదుకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరి, , జాయింట్ కలెక్టర్ నూరుల్లా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, రెవెన్యూ విభాగపు అధికారులకు తహసీల్దారులకు తదితరులు ఈ సందర్భంగా ఏపీఆర్ ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

