కిడ్నీ క్యాన్సర్ పై స్పీచ్ ..
1 min read
వ్యాధి లక్షణాలు, నిర్ధారణపై స్పష్టంగా వెల్లడి
- ఏపీ, తెలంగాణ యురాలజి కాన్ఫరెన్స్ లో డా. సేపూరి బాల రవితేజ
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు:ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ యురాలజి 37వ కాన్ఫరెన్స్ ఆదివారం నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. యురాలజి సొసైటీ ఆఫ్ నంద్యాల, కర్నూలు వారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో కర్నూలు యురాలజిస్టి డా. సేపూరి బాల రవి తేజ పాల్గొన్నారు. అందులో భాగంగా కాన్ఫ రెన్స్లో కిడ్నీ క్యాన్సర్ పై మాట్లాడారు. వ్యాధి లక్షణాలు, నిర్ధారణ తదితర వివరాలను క్షుణ్ణంగా వెల్లడించారు. మూత్రపిండాల కణజాలంలో కణాలు అసాధారణంగా పెరిగి కణితులు ఏర్పడతాయని, దీని లక్షణాలు సాధారణంగా కనిపించవని పేర్కొన్నారు. కొందరిలో వెన్ను లేదా పక్కటెముకల క్రింద నొప్పి, మూత్రంలో రక్తం, బరువు తగ్గడం వంటివి ఉంటాయి.. ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు, మరియు కిడ్నీ క్యాన్సర్ కుటుంబ చరిత్ర వంటివి ప్రమాద కారణాల వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే 65 నుంచి 70 ఏళ్ల వయస్సు వారికి సాధారణంగా వచ్చే కిడ్నీ క్యాన్సర్ … మహిళల కంటే పురుషులకు రెండు రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉంటుందని, వ్యాధి లక్షణాలను ముందే గుర్తిస్తే కొంత నియంత్రించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా యురాలజిస్టు డా. సేపూరి బాల రవి తేజ వెల్లడించారు.


