పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన ఎం.రహంతుల్లా
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రానికి చెందిన ఎం.రహంతుల్లా శుక్రవారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో శ్రీకాకుళం బెటాలియన్ ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.రహంతుల్లా మండల కేంద్రంలోని ఒక పేద కుటుంబానికి చెందినవాడు.తండ్రి పేరు ముల్లా.వలి,తల్లి హుసేన్ బీ, రహంతుల్లా ఒకే ఒక్క కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తండ్రి మండల కేంద్రంలో ఒక చిన్న సోడా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుమారుడు రహంతుల్లాను చదివించాడు.రహంతుల్లా కర్నూలు నందు డిగ్రీ వరకు చదువుకున్నాడు.తర్వాత దాదాపు 4 సంవత్సరాల నుండి పోలీసు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు.కూటమి ప్రభుత్వం పోలీసు నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుండి మరింత కష్టపడి పరీక్షలకు సన్నద్ధం అయ్యాడు.పోలీసు ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఏపీ.ఎస్.పి.పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.కష్టపడి చదివించిన,తన కుమారుడు తన కష్టం వృథా కాకుండా ఉద్యోగానికి ఎంపికవడంతో కుటుంబ సభ్యులు,బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టమొచ్చినా తనను చదివించిన తల్లిదండ్రులకు, ఎల్లప్పుడూ తనకు సహాయ సహకారాలు అందించిన స్నేహితులకు రహంతుల్లా ధన్యవాదాలు తెలిపారు.

