డివైఎఫ్ఐ పట్టణ మహాసభను జయప్రదం చేయండి
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: స్థానిక నంద్యాల పట్టణంలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో ఈనెల 16వ తేదీన డివైఎఫ్ఐ పట్టణ మహాసభ నిర్వహించడం జరుగుతుందని దాన్ని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు మూర్తి పట్టణ మహాసభ పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని డివైఎఫ్ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. నంద్యాల పట్టణంలో ఈనెల 16వ తేదీన డివైఎఫ్ఐ పట్టణ మహాసభ సమావేశం నిర్వహించడం జరుగుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగ సమస్యల పైన నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పైన పోరాటానికి సిద్ధం కావడానికి ఈ పట్టణ మహాసభ వేదికగా మారుతుందని అదేవిధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డివైఎఫ్ఐ తన వంతు ప్రజలు చైతన్యవంతం చేయడంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు పోవడంలో ముందుకు సాగుతుందని అదేవిధంగా ముఖ్యంగా డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అంటూ ముందుకు సాగుతుందని అదేవిధంగా ఈ డివైఎఫ్ఐ పట్టణ మహాసభకు నంద్యాల ఉన్నటువంటి ప్రముఖులు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ వార్డు కమిటీ సభ్యులు చరణ్, దుర్గా తేజ, హరీష్, నాగేంద్ర, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


