వీరాంజనేయ ఆలయ స్థలంపై హద్దుల వివాదం!
1 min read
హంద్రీ–నీవా అధికారులు ఏర్పాటు చేసిన హద్దులను తొలగించాలి – ధర్మకర్త భవాని శంకర్
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు నగరంలోని బంగారుపేటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని పరిరక్షించాలని ఆలయ ధర్మకర్త ఎం.వి. భవాని శంకర్ అధికారులను కోరారు. దేవస్థాన స్థలంలోని సర్వే నంబర్ 176లో హంద్రీ–నీవా సుజల స్రవంతి అధికారులు ఏర్పాటు చేసిన హద్దులను తొలగించి, ఆలయ స్థలానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థాన స్థలంపై ఎలాంటి వివాదాలకు తావులేకుండా అధికారులు సమగ్రంగా పరిశీలించి, ఆలయానికి సంబంధించిన హక్కులు, హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని ఆయన కోరారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన స్థలాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఎం.వి. భవాని శంకర్ అధికారులను డిమాండ్ చేశారు.


