హజ్ యాత్రకు వెళ్లే వారికి మెడికల్ కిట్స్,లగేజీ బ్యాగ్స్ అందజేత
1 min read
అంజుమాన్-ఇ -ముహా ఫీజుల్ ఇస్లాం,హజ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో..
అల్లా ఆశీస్సులు అందుకుని క్షేమంగా తిరిగి రావాలి
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అంజుమన్-ఇ-ముహాఫిజుల్ ఇస్లాం ఏలూరు మరియు హజ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంజుమన్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రలో భాగంగా ఏలూరు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధ కృష్ణ (చంటి) పాల్గొని వారి చేతుల మీదుగా హజ్ యాత్ర కి వెళ్ళే వారికి మెడికల్ కిట్స్, లగేజ్ బ్యాగ్స్ అందజేయడం జరిగినది. అల్లాను దర్శించుకుని, ఆశీస్సులు అందుకుని ఆహ్లాదంగా ఆనందంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఆ స్వస్థల ప్రదేశాలను సందర్శించి క్షేమంగా తిరిగి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ అధ్యక్షులు షేక్. నసీరుద్దీన్ మరియు అంజుమన్ అధ్యక్షులు ఎం.డి. జబివుల్లా, సెక్రటరీ ఎం.డి. అహ్మదుల్లా షరీఫ్, ట్రేజరర్ షేక్ సిరాజ్ బాషా,రాజా అహ్మద్ , ఇలియాస్ పాషా 45వ డివిజన్ కార్పొరేటర్ , రియాజ్ అలీ ఖాన్ మరియు అంజుమన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.