సేవా సంకల్ప అభియాన్లో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన
1 min read
డ్రాయింగ్, ప్రసంగ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఈఓలు సుధారాణి, పి. కబీర్ సాబ్
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం (28-09-2026) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోళగుందలో డ్రాయింగ్ మరియు ప్రసంగ పోటీలను నిర్వహించారు. మండల విద్యాధికారి–1 సుధారాణి, మండల విద్యాధికారి–2 పి. కబీర్ సాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు డ్రాయింగ్, ప్రసంగ పోటీల్లో తమ సృజనాత్మకత, ప్రతిభను చక్కగా ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.అనంతరం ఎంఈఓ–1 సుధారాణి, ఎంఈఓ–2 పి. కబీర్ సాబ్, ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, సీఆర్ఎంటీలు కలిసి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం మరియు ప్రతిభను పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు మంచి వేదికగా నిలిచింది.



