ఆలూరు ఓటర్లకు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అత్యవసర విజ్ఞప్తి
1 min read

ఎస్‌ఐఆర్ గడువు ఈరోజు, రేపుతో ముగింపు – ఓటరు గణన ఫారాన్ని తప్పనిసరిగా బీఎల్‌ఓకు సమర్పించండి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మాట్లాడుతూ, “ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ఈరోజు, రేపు మాత్రమే గడువు ఉంది. ప్రతి ఓటరు తమ ఓటరు గణన ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌ఓకు తప్పనిసరిగా సమర్పించాలి. ఓటు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉండాలంటే ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఫారాన్ని సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.ఆలూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం తమ ఇంట్లోని అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన ఫారాలను గడువులోగా బీఎల్‌ఓకు అందజేయాలని ఆయన సూచించారు.
“మీ ఓటు… మీ హక్కు… మీ బాధ్యత.”
ప్రతి ఓటరు తమ బాధ్యతను గుర్తించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పిలుపునిచ్చారు.


