NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ విజయాంధ్ర తీర్థుల రథోత్సవంలో ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ఘన సన్మానం

1 min read

– అన్నదాన సేవలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకుడు

హొళగుందన్యూస్ నేడు: హొళగుందలో నిర్వహించిన శ్రీ విజయాంధ్ర తీర్థుల విశ్వవిఖ్యాత 412వ ఆరాధన మహోత్సవాల చివరి రోజు రథోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ విజయాంధ్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్కు ఘన స్వాగతం పలికి సన్మానించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. మేళతాళాలు, భజనలు, హరినామ సంకీర్తనలు, నృత్య కోలాటాల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈబీజీ గోవింద్ గౌడ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ విజయాంధ్ర తీర్థుల వారికి నమస్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దేవస్థాన పెద్దలు, వేదపండితులు ఆయనను ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. వారి చేతుల మీదుగా రథోత్సవాన్ని ప్రారంభించగా, భక్తుల హర్షధ్వానాల మధ్య రథోత్సవం విజయవంతంగా కొనసాగింది.రథోత్సవం అనంతరం ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించి సేవాభావాన్ని చాటారు. ప్రజాసేవతో పాటు దైవసేవను కూడా సమానంగా భావిస్తూ ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం చురుకుగా పాల్గొంటూ ప్రజల ఆదరణ పొందుతున్నారని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, శ్రీ విజయాంధ్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు, దేవస్థాన కమిటీ సభ్యులు, వేదపండితులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *