NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోరుకల్లు వాటర్ గ్రిడ్ పంప్ హౌస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:- ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేస్తున్న వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ పంప్ హౌస్‌ను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని గురువారం డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిపరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి తాగునీటి సరఫరా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా త్వరితగతిన గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, వాటర్ గ్రిడ్ పనులు పూర్తయిన అనంతరం మండలంలోని గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు రామకృష్ణ, రామ్ భూపాల్, మండల కన్వీనర్ సుదర్శన్, శివశంకర్,సుంకన్న, సాంబ, మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *